అమన్‌గల్‌లో విదేశీ యువతి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అమన్‌గల్‌లో విదేశీ యువతి ఆత్మహత్య

April 14, 2018

రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో ఓ విదేశీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొన్నినెలల కిందట వ్యభిచారం కేసులో పట్టుబడిన వర్ఫాలియా జుల్పియాన్ అనే యువతి శనివారం ప్రజ్వల మహిళా పునరావాస కేంద్రంలో ఉరివేసుకుని చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు. పునరావాస కేంద్ర నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మానసిక వేదనతో ఆమె ప్రాణం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

పాతికేళ్ల వయసున్న వర్ఫాలియాను కొందరు బ్రోకర్లు గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీకి తీసుకొచ్చి వ్యభిచారం కూపంలో దించారు. ఆమె వీసా గడువు ముగిసిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న బ్రోకర్లు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రజ్వల కేంద్రంలో ఉంచారు.