ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలు..రాత పరీక్షలేకుండానే 583 ఉద్యోగాలు ...!! - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలు..రాత పరీక్షలేకుండానే 583 ఉద్యోగాలు …!!

March 9, 2023

ICSIL..న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 593 మీటర్ రీడర్స్, ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మీటర్ రీడర్స్ పోస్టులకు ఇంటర్అర్హత ఉంటే సరిపోతుంది. ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

పై అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో మార్చి 10, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ నింపే సమయంలో ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 1000లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ. 20, 357ల నుంచి రూ 22, 146 వరకు జీతం చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.