ముక్కోటీ ఏకాదశి నాడు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. విరివిగా కానుకలు సమర్పించారు. హుండీ ఆదాయం ద్వారా ఒక్కరోజులోనే రూ.7.68కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 23న లభించిన రూ.6.31కోట్లే ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం. తాజాగా వైకుంఠ ఏకాదశి రోజున వచ్చిన మొత్తం దాన్ని అధిగమించినట్లయింది.
కాగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వారా సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు రికమండేషన్ లెటర్ల దర్శనాలు రద్దు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి తిరుమల క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
నిన్నటిదాకా చంద్రబాబును అన్నారు.. ఇప్పుడు జగన్ సభలో