వాజపేయికీ రిప్.. మొన్న జయంతికి! - MicTv.in - Telugu News
mictv telugu

 వాజపేయికీ రిప్.. మొన్న జయంతికి!

March 30, 2018

దక్షిణాది ప్రముఖ సినీనటి జయంతి చనిపోయిందని పుకార్లు షికార్లు చేయడం, మా అమ్మ భేషుగ్గా ఉందని, రేపోమాపో ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తుందని ఆమె కుమారుడు తేల్చిచెప్పడం తెలిసిందే. నిజానిజాలు నిర్ధారించుకోకుండా వస్తున్న ఇలాంటి వార్తలతో చాలామంది బాధపడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కూడా చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖానులుగా వెలువడుతున్నారు. ఆయన బొమ్మ అతికించి రిప్ చెబుతున్నారు.అయితే ఇది నిజం కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వాజపేయి చనిపోయాడన్న వార్తలు కొత్తేమీ కాదు. 2015లోనూ వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై బీజేపీ స్పష్టత ఇవ్వకపోతుండడం, ఫొటోలు కూడా బయటికి ఇవ్వకపోతుండడంతో మరణ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2015లో వాజపేయి చనిపోయినట్లు వార్తలు రావడంతో ఒడిశాలో ఒక ఉపాధ్యాయుడు సంతాప సభ నిర్వహించాడు. తర్వాత అతనిపై చర్యలు తీసుకున్నారు.