బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా ప్రకారం.. బ్లింకిట్ ఫిబ్రవరి 14 ఉదయం 10గంటల వరకు 10వేల కంటే ఎక్కువ సింగిల్ గులాబీలను పంపిణీ చేసింది.
దేశవ్యాప్తంగా ప్రజలు తమ ప్రియమైన వారికి బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నారింకా. ప్రేమికుల రోజు అంటేనే పువ్వులే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఈ సంవత్సరం కూడా పూల వ్యాపారం తక్కువేమీ లేదు. ఒక ప్రధాన సంస్థ ఉదయం వరకు తమ అమ్ముడు లెక్కను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వివరాలేంటో చదువండి.
బొకేల అమ్మకం..
ప్రేమికుల రోజు ఈ సంవత్సరం పూర్తి స్వింగ్ లో ప్రారంభమైంది. దీనికి సాక్ష్యం ఇచ్చారు బ్లింకిట్ సీఈవో. ఆయన లెక్కల ప్రకారం.. కేవలం బ్లింకిట్ ద్వారా ఈరోజు ఉదయం 10 గంటలకు 10వేల కంటే సింగిల్ గులాబీలను డెలివరీ చేసింది. అంతేకాదు.. 1200 పుష్పగుచ్చాలను అదేనండీ బొకేలను కూడా డెలివరీ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు ఆ కంపెనీ సీఈవో. వాలెంటైన్స్ డేకి శుభారంభం జరిగిందంటూ క్యాప్షన్ కూడా రాశారు.
చాక్లెట్స్ కూడా..
సాధారణంగా ప్రేమికుల రోజునే కాకుండా.. ప్రేమికుల వారంలో కూడా కొన్ని బహుమతులను ఇచ్చుకుంటారు. ముఖ్యంగా రోజ్ డే, చాక్లెట్ డేని తప్పక జరుపుతారు. అయితే రోజ్ డే రోజున మాత్రం ఎక్కువ ఆర్డర్లు రాలేదని బ్లింకిట్ సీఈవో తెలిపారు. కానీ ఈరోజు మాత్రం ఆల్ టైమ్ హైక్ ని తాకిందని తెలియచేశారు. అంతేకాదు.. చాక్లెట్ డేన కూడా వారంలో విక్రయించే దానికంటే ఆరోజు ఎక్కువ చాక్లెట్లను విక్రయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చాక్లెట్ల అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు చూపించే గ్రాఫ్ ని కూడా ట్వీట్ చేశారు అల్బిందర్.