Valentine's Day 2023 : Shruti Haasan shares a lovey-dovey pic with Santanu Hazarika
mictv telugu

శాంతాను హజారికాకు వాలెంటైన్స్ డే విషెస్ తెలిపిన శ్రుతిహాసన్!

February 14, 2023

ఎంతో ఎదురుచూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ప్రేమికులందరూ ప్రియమైన వారికి విషెస్ తెలిపే పనిలో ఉన్నారు. అందులో మన ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ మోనోక్రోమ్ చిత్రంతో శాంతాను హజారికాకు విషెస్ చెప్పింది.
ప్రేమను తెలుపడంలో ఒక్కరిదీ ఒక్కో పద్ధతి. ఇలాగే తెలుపాలనే రూల్ అంటూ ఏమీ లేదు. కొందరు పువ్వులు ఇచ్చి చెప్పొచ్చు. మరికొందరు బహుమతులిచ్చి సర్ ప్రైజ్ చేయొచ్చు. కొందరు యూనిక్ గా ఉండాలనుకుంటారు. కొందరైతే.. శుభాకాంక్షలతో ఎంతో సంతోషపడుతారు.
వాల్తేరు వీరయ్య హిట్ తో శ్రుతి మళ్లీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ అమ్మడు ప్రేమికుల రోజున తన ప్రియుడికి లవ్ డోవీ పిక్ తో శుభాకాంక్షలు తెలిపింది. డూడుల్ ఆర్టిస్ట్, వృత్తిరీత్యా ఇలస్ట్రేటర్ అయిన శాంతాను తో రిలేషన్ లో ఉంది శ్రుతి. మంగళవారం ఈ చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. ‘నువ్వే బెస్ట్ గిఫ్ట్. నువ్వు నా ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటావు. నువ్వు నా సన్ షైన్. అంతేకాదు.. నేను చాలా అదృష్టవంతురాలైన అమ్మాయిని’ అంటూ క్యాప్షన్ జత చేసింది.
శ్రుతి, శాంతాను గత కొన్నేళ్లుగా ప్రేమికులుగా ఉన్నారు. వారు బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. పరస్పర అవగాహన పంచుకుంటున్నారు. వారు తరుచుగా చాలా ఈవెంట్స్ కి కలిసి రావడం, సంగీత వేదికలు పంచుకోవడంలో వీరి ప్రేమ మరింత బలంగా ఉందని వారు చెప్పకనే చెప్పారు.
శ్రుతి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలాంటి రెండు సూపర్ హిట్స్ లోనూ కనిపించింది. ఆమె తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.