మీరు సింగిలా? అయితే మీకో బంపర్ ఆఫర్! ఈ రోజు అస్సాంలోని ఒక హోటల్ లో ఉచిత బిర్యానీ ఇస్తున్నారట. మరి భోజనప్రియులు ఆ హోటల్ వరకు వెళ్లొద్దాం రండి.
అస్సాంలోని సిల్చార్ లోని ‘ఖానా.. కజానా’ అనే ఫుడ్ అవుట్ లెట్ ఈరోజున సింగిల్స్ కి ఉచితంగా బిర్యానీని అందిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒంటరిగా ఉండకూడదని, వారికి ఓదార్పుగా ఈ ప్రేమ కానుక అందిస్తున్నట్లు ఆ హోటల్ యాజమాన్యం ప్రకటించింది.
ఆ ప్రకటనలో..
వాలెంటైన్స్ డే.. సెయింట్ వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్ ఫీస్ట్ అని కూడా పిలుస్తారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులనే కాదు.. వారి కడుపును కూడా ప్రేమించేలా చేయడానికి సింగిల్స్ కి ఉచితంగా హాఫ్ ప్లేట్ బిర్యానీని అందచేస్తుంది. అవులెట్ యజమాని చిరంజీవ్ గోస్వామి ‘అవును.. వచ్చే సింగిల్స్ కి బిర్యానీ ఫ్రీగా ఇస్తాం. వారికి కూడా ఏదో ఒక ఆప్షన్ ఉండాలి’ అని చెప్పాడు. అయితే కొందరు బిర్యానీ కోసం మోసం చేయడానికి ఒంటరిగా ఉన్నామని చెబుతారని అలాంటి వారిని గుర్తిస్తామని యజమాని తెలుపుతున్నాడు. ఇది కాకుండా ఈ రెస్టారెంట్ లో ప్రేమికుల వారం మొత్తం 25శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈరోజు మాత్రం ఫుడ్ మీద 10శాతం డిస్కౌంట్ ఉంది. ఆ ప్రాంతం ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ రెస్టారెంట్ వైపు ఓ లుక్కేయండి.