వాలంటైన్స్ డే.. హైదరాబాద్‌లో బజరంగ్ దళ్ విధ్వంసం  - MicTv.in - Telugu News
mictv telugu

వాలంటైన్స్ డే.. హైదరాబాద్‌లో బజరంగ్ దళ్ విధ్వంసం 

February 14, 2020

Valentines day

ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ పలు చోట్ల నిరసనలు సాగాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొన్ని షాపింగ్ మాల్స్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. షాపుల ముందు నినాదాలతో హోరెత్తించారు. బజరంగ దళ్ కార్యకర్తులు తర్వాత లోపలికి చొరబడి.. వాలంటైన్స్ డే సామగ్రిని చిందరవందర చేశారు. కుర్చీలను, టేబుళ్లను ఎత్తిపడేశారు. ‘బంద్ కరో బంద్ కరో.. వాలంటైన్స్ బంద్ కరో.. జై భారత్, జైజై భారత్’ అని నినదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని చెదరగొట్టాయి. మరోపక్క.. విశాఖపట్నంలోనూ నిరసనలు కొనసాగాయి. ‘ప్రేమికుల రోజును ఛీకొట్టు.. అమర జవాన్లకు జైకొట్టు’ అని నినాదాలు చేశారు. 

Publiée par Satyavathi Satya sur Vendredi 14 février 2020

Publiée par Satyavathi Satya sur Vendredi 14 février 2020