ప్రేమికుల రోజు సందర్భంగా యువతీ యువకులు తమ లవర్స్‌తో గడపాలనుకుంటారు. ఆరోజు వారితో ప్రత్యేకమైన మధురానుభూతులను పంచుకుంటూ ఆ క్షణాలను ఏడాదంతా మదిలో దాచుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అయితే మెజారిటీ భారతీయ కుటుంబాల్లోని యువతకు అంత స్వేచ్ఛ ఉండదు. ముఖ్యంగా యువతులను ఆ రోజు కుటుంబసభ్యులు నియంత్రిస్తారు. ప్రేమా దోమా అంటూ తిరిగి చెడిపోతారని వాళ్ల భయం. కానీ ఓ యువతి మాత్రం ఇంట్లో తెలియకుండా తన ప్రియుడిని రహస్యంగా మేడ మీద కలిసింది. విషయం తెలుసుకున్న తల్లి మేడమీదికి వచ్చి ప్రియుడిని గాలించి ఉన్నపళంగా పట్టుకుంది. అతడిని తన ఎడమ కాలి చెప్పుతో కొడుతూ బుద్ది చెప్పింది. ఇంతలో యువకుడు ఆమె నుంచి తప్పించుకొని కిందకు వెళ్లిపోయాడు. తర్వాత కూతురు వద్దకు వచ్చి మళ్లీ ఎడమ చెప్పుతోనే ముఖం మీద ఎడాపెడా వాయించేసింది. ఇదంతా పక్క బిల్డింగ్ నుంచి ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో నెటిజన్లు కామెంట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ‘వాలంటైన్ డే అందరికీ ఒకేలా ఉండదు బ్రదర్’, ‘భారతీయ అమ్మలు అంతే.. ఇలాంటివి అస్సలు సహించరు’, ‘ఆంటీజీ, మీ కూతురికి తొందరగా పెళ్లి చేయండి లేకపోతే పరువు గంగలో కొట్టుకుని పోతుంది’, ‘ప్రేమికుల రోజు పత్యాపారం చేస్తూ ఇలా దొరికిపోయారేంటీ’, ‘అమ్మాయి డ్రెస్ చూస్తేనే తెలిసిపోతోంది ఎలా పెరిగిందో’, అమ్మాయిలకు ఫ్రీడం ఇస్తే ఇలానే ఉంటుంది’ లాంటి కామెంట్లు చేస్తున్నారు.
mother catches daughter while romancing with her boyfriend upstairs