ఓటీటీలో ‘వలిమై’ నయా రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

ఓటీటీలో ‘వలిమై’ నయా రికార్డు

March 28, 2022

 bbbb

తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన 60వ చిత్రం వలిమై. ఇందులో మన తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా నటించారు. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ చిత్రం కరోనా తర్వాత రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. ఇందులో అజిత్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పడీ చిత్రం ఓటీటీలో దుమ్ము రేపుతోంది. మార్చి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 24 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్‌ని సాధించి ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 200 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ సాధించింది. ఇటీవల కాలంలో ఇతర ఏ సినిమా కూడా ఇంతలా స్ట్రీమింగ్ అవలేదు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందింది. అజిత్ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా వలిమై నిలిచింది. బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్‌లో తప్ప మిగతా భాషల వారికి పెద్దగా ఆకట్టుకోలేదు.