Valley of Peace
mictv telugu

వాలీ ఆఫ్ పీస్- ఊరంత శ్మశానం

November 12, 2022

Valley of Peace

జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది శ్మశానం. ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటి అని ఆలోచిస్తున్నారా. ఊరిలో ఉండే దాని గురించి అయితే చెప్పుకోనక్కరలేదు కానీ ఒక ఊరే శ్మశానం అయితే…కచ్చితంగా చెప్పుకోవలసిన విషయమే కదా.

ఇలాంటి శ్మశానం ఇరాక్ లో ఉంది. దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్‌ సలామ్‌’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్‌ పీస్‌’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ.
షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనదిట. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి.

18వ శతాబ్ధంలో ఇరాన్‌ – ఇరాక్‌ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంతో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాక్కన్నారని చాలా సమాధులను ఇరాక్‌ సైన్యం పడగొట్టారుట. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలోనే ఖననం చేశారుట.శ్మశానానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్‌ సలామ్‌ ఓ ఉదాహరణ. అందుకే మనం ఈ రోజు దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం.