Home > Featured > 4 బుల్లెట్లు సంపాదిత్తె రెండు కాల్చకోవాలె.. వాల్మీకి

4 బుల్లెట్లు సంపాదిత్తె రెండు కాల్చకోవాలె.. వాల్మీకి

‘అందుకే పెద్దలు జెప్పిర్రు నాలుగు బుల్లెట్లు సంపాదిత్తె రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అంటూ మెగా కంపౌండ్ హీరో వరుణ్ తేజ్ మాస్ లుక్‌తో వినూత్నంగా కనిపించాడు. వరుణ్ తాజాగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా టీజర్ విడుదల అయింది. ‘నా సినిమాలో నా విలనే.. నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభం అయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో వరుణ్ గడ్డంతో, కళ్లకు సుర్మా పెట్టుకుని విభిన్నంగా కనిపిస్తున్నాడు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా మాదిరి ఈ సినిమాలో కూడా హీరో పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడతాడా అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ ఇప్పటి వరకు పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడని అంటున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈసినిమా సెప్టెంబరు 13న విడుదలకు సిద్ధమవుతోంది.

Updated : 15 Aug 2019 8:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top