వామ్మో: విశ్వక్‌సేన్‌కు ఇంత ఆస్తి ఉందా! - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో: విశ్వక్‌సేన్‌కు ఇంత ఆస్తి ఉందా!

May 6, 2022

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్‌సేన్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. గతవారం ఓ ప్రముఖ ఛానల్‌ లైవ్ డిబేట్‌తో విశ్వక్‌సేన్ మరింతగా పాపులర్ అయ్యాడు. తాజాగా విశ్వక్‌సేన్‌ ఆస్తులకు సంబంధించిన మరో వార్త తెగ వైరల్ అవుతోంది. ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయన వరుసగా.. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’, ‘హిట్’, ‘పాగల్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం ఈరోజు విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే, విశ్వక్‌సేన్‌కు సుమారుగా రూ.75 కోట్లకుపైనే ఆస్తి ఉందని సమాచారం. విశ్వక్‌సేన్‌కు.. దిల్‌సుఖ్ నగర్‌లో ఖరీదైన బంగ్లా, రేంజ్ రోవర్ కారు కూడా ఉంది అని తెలుస్తోంది. ఈ ఆస్తులన్నీ తన తల్లిదండ్రులు నుంచి వారసత్వంగా విశ్వక్‌సేన్‌కు చెందుతాయని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ వామ్మో విశ్వక్‌సేన్‌కు ఆస్తులు బాగానే ఉన్నాయే అని షాక్ అవుతున్నారు.