వామ్మో.. పెట్రోల్ ధర ఇంతన - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. పెట్రోల్ ధర ఇంతన

March 30, 2022

gnnn

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగిపోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో చికెన్ ధరలు, వంటనూనె ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ పై 90 పైసలు, డీజిల్‌‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరిగిన ధరను చూసి, షాక్ అవుతున్నారు.

మరోపక్క ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు కంపెనీలు సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. గత మంగళవారం (మార్చి 22 నుంచి మార్చి 24) మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.51 పైసలు
డీజిల్‌ ధర రూ.100.70గా ఉంది.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.01
డీజిల్‌ ధర రూ.100.21గా ఉంది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.88
డీజిల్‌ధర రూ.100.10గా ఉంది.

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.69
డీజిల్‌ ధర రూ.96.76 గా ఉంది.