వంశీ పెడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా డైలీ సీరియల్ అంటూ సోషల్ మీడియాల్లో ట్రోలింగ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా వారసుడు పేరుతో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర ఓకే అనిపించుకున్నా అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. మరోవైపు వాల్తేరు వీరయ్య మూడీ అదరగొడుతుండడంతో ఈ సినిమా మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువ అయ్యాయి. అసలు ట్రైలర్ విడుదల అయిన దగ్గర నుంచే వారసుడు మూవీని ఆట ఆడేసుకుంటున్నారు జనాలు.
తాజాగా వారసుడు సినిమా డైలీ సోప్ అంటూ పోస్ట్ లు వచ్చాయి. దీని మీద దర్శకుడు వంశీ పైడిపల్లి మండిపడ్డారు. ఆ డైలీ సీరియల్ నే ప్రేక్షకులు చూస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సినిమా తీయడం అంత ఈజీ పని కాందటూ కారాలు-మిరియాలు నూరారు. ఈరోజుల్లో సినిమా తీయడం ఒంత కష్టమైన పనో మీకు తెలసా. ఇదేమీ జోక్ కాదు, ఎన్నో త్యాగాలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. తలపతి విజయ్ సూపర్ స్టార్స్ లో ఒకరు. మనం ఏం చేయగలమనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. విజయ్ నా సినిమాకు, సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా అని చెప్పుకొచ్చారు.
సినిమాను డైలీ సీరియల్ తో పోల్చడం ఏంటి? సాయంత్రం అయితే టీవీలో ఎంతమంది చూస్తారో తెలుసా మీకు? మీ ఇళ్ళల్లో చూసుకోండి, ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీరియల్ చూస్తూనే ఉంటారు. ఎందుకు సీరియల్న్ ని కించపరుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీ. ఎవరినైనా కింద లాగుతున్నావంటే, నిన్ను నువ్వు కిందకు లాక్కున్నట్టే. మరీ అంత నెగటివ్ గా ఉండకండి, అది మిమ్మల్నే తినేస్తుంది అంటూ హితబోధ చేశారు. అలా అంటూనే ఇలాంటి కామెంట్స్ ను నేను పట్టించుకోను. నా పనిని, వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోనని చెప్పారు. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. నేనొక కమర్షియల్ సినిమా తీశాను బ్రదర్. నేనేమీ అద్బఉతమైన సినిమా తీశాను చెప్పడం లేదు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికే మూవీ చేశా అన్నారు. వారిసు నేను అనుకున్నట్టే ప్రేక్షకులను అలరిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.