Vamsi, Kodali Nani entered in Nara Lokesh Zoom Meeting
mictv telugu

నారా లోకేష్ జూమ్ మీటింగ్‌లో వంశీ, కొడాలి నాని.. కట్ చేస్తే షాక్

June 9, 2022

Vamsi, Kodali Nani entered in Nara Lokesh Zoom Meeting

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో విద్యార్ధులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించగా, లైన్‌లోకి టీడీపీ మాజీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలు మీటింగులో ఎంటరయ్యారు. మొదట వంశీ ఆఫీసు నుంచి ఓ విద్యార్ధిని ఎంటరవగా, కొద్ది సేపటికే వంశీ ప్రత్యక్షమయ్యారు.

అనంతరం లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే కొడాలి నాని కూడా ప్రవేశించడంతో లోకేష్ సహా టీడీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దొంగ ఐడీలతో ప్రవేశిస్తారా? అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల పేరెంట్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్వాహకులు వారి లైన్‌ను కట్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై టీడీపీ మండిపడింది. విద్యార్ధులతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది.