శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో విషాదం.. 9 మందికి తీవ్ర గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో విషాదం.. 9 మందికి తీవ్ర గాయాలు

September 23, 2020

nvgnv

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి ఓ క్వాలీస్ లోయలో పడిపోయింది.ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఇది జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. వీరంతా హైదరాబాద్‌లోని దూల్ పేట వాసులుగా గుర్తించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. 

శ్రీశైలం పర్యటన కోసం వీరంతా ఓ క్వాలీస్ వాహనంలో బయలుదేరారు. మైసమ్మగుడి మొదటి మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. వెంటనే 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని అనిల్‌ సింగ్,ధర్మేష్, ధార్మిక్‌,హేమలత, నీతూ సింగ్, నమ్రతాసింగ్, సుమన్‌లత, అస్మిత్‌ సింగ్, రాజకుమారిగా పేర్కొన్నారు. వీరిలో నీతూ సింగ్‌ (40), రాజకుమారి (55), ధర్మిక్‌ (8) పరిస్థితి విషమంగా ఉండటం హైదరాబాద్‌కు చికిత్స కోసం తరలించారు.