Vanadurga temple washed away in Godavari
mictv telugu

గోదావరిలో కొట్టుకుపోయిన వనదుర్గ ఆలయం.. వీడియో వైరల్

July 30, 2022

గోదావరి నదికి వస్తున్న వరదల ధాటికి తూర్పుగోదావరి జిల్లాలో ఆలయం కొట్టుకుపోయింది. సీతానగరం మండలం పురుషోత్తమపట్నంలో గోదావరి ఒడ్డున వనదుర్గ ఆలయం ఉంది. ఇటీవల వచ్చిన వరదలకు నీరు ఆలయం వరకు చేరుకోగా, శుక్రవారం వచ్చిన మరింత వరదలకు తీరం కోతకు గురైంది. మధ్యాహ్నానికి ఆలయం ఒకవైపు ఒరగడంతో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ఉన్న భక్తులు అప్రమత్తమయ్యారు. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని భావించిన గ్రామస్థులు మధ్యాహ్నం నుంచి ఆలయంలో ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నారు. తర్వాత సాయంత్రానికి ఆలయం నదిలో కుప్పకూలిపోయింది. 15 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరిగాయని భక్తులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనను స్థానిక యువత ఫోన్ల ద్వారా వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.