వనపర్తి యువకుడు జాక్‌పాట్.. ఏకంగా రూ.1.20 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వనపర్తి యువకుడు జాక్‌పాట్.. ఏకంగా రూ.1.20 కోట్లు

May 6, 2022

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లికి గ్రామానికి చెందిన అనీష్‌ కుమార్‌ రెడ్డి జాక్‌పాట్ కోట్టాడు. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి, అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అనీష్‌ కుమార్‌రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

దాంతో అనీష్‌ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గత సంవత్సరం జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. ఇటీవలే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అమెజాన్ కంపెనీ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఇంటర్వ్యూకు హాజరైన, అనీష్‌ కుమార్ రెడ్డి టెక్నికల్ విభాగంలో టీం లీడర్‌గా ఉద్యోగానికి రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఎంపికయ్యాడు. కొడుకు పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించడంతో అతడి తల్లిదండ్రులు వంగూరు బాలీశ్వర్‌రెడ్డి-వసంతలక్ష్మి ఆనందంలో మునిగి తేలుతున్నారు.

మరోపక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్‌ సంస్థగా అమెజాన్‌ పేరుగాంచిన విషయం తెలిసిందే. అటువంటి అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో తొలి క్యాంపస్‌ని నిర్మిస్తోంది. 2015లో నిర్మాణ పనులను చేపట్టింది. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కంపెనీ పూర్తయితే గనుక తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.