Vanasthalipuram CI Raju arrested by police
mictv telugu

వనస్థలిపురం సీఐ ఇల్లీగల్ ఎఫైర్. కేసు నమోదు

November 4, 2022

Vanasthalipuram CI Raju arrested by police

మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరువక ముందే హైదరాబాదులోని మరో సీఐ అక్రమ సంబంధం నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం సీసీఎస్ విభాగంలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రాజు.. ఓ మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా, అతని భార్య గుట్టు రట్టు చేసింది. తనకు న్యాయం చేయాలని పిల్లలతో కలిసి స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మరో యువతితో ఏకాంతంగా కారులో ఉన్న సీఐ రాజును పట్టుకున్నారు. అరెస్ట్ చేయబోతే దాడికి యత్నించగా, కానిస్టేబుల్ ఫిర్యాదుతో సీఐ రాజును అరెస్ట్ చేశారు. కాగా, పోలీస్ డిపార్ట్‌మెంటులో వరుసగా జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీఐ నాగేశ్వరరావు, తర్వాత చర్లపల్లి జైలు సూపరింటెండెంట్, తాజాగా వనస్థలిపురం సీఐలు అక్రమ సంబంధం, లైంగిక వేధింపులతో పట్టుబడంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎక్కువైన మాట నిజమే అయినా, బాధ్యత కలిగిన విధుల్లో ఉంటూ ఇలాంటి పనులు చేయడం వల్ల చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. సీఐ నాగేశ్వరరావుపై తీసుకున్నట్టుగానే సీఐ రాజుపై పోలీస్ శాఖ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.