Vande Bharat train started between Visakha and Vijayawada in December
mictv telugu

విశాఖ నుంచి రెండు వందే భారత్ రైళ్లు.. ఒకటి విజయవాడకి మరోటి

November 25, 2022

Vande Bharat train started between Visakha and Vijayawada in December

ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ హామీ ఇచ్చిన వందే భారత్ రైలు పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే వాల్తేరు డివిజన్ ని ప్రత్యేక కేంద్రంగా గుర్తించగా, హామీ ఇచ్చిన వందే భారత్ రైలు డిసెంబర్ రెండో వారంలో పట్టాలెక్కబోతుంది. రద్దీగా ఉండే విశాఖ నుంచి విజయవాడకు తొలి వందే భారత్ రైలు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ట్రాక్ పరిశీలన చేశారు. గరిష్టం 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందే భారత్ రైలులో 8 కోచ్ లు ఉంటాయి.

దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 4 గంటలకు తగ్గనుంది. చార్జీల విషయానికి వస్తే ఛైర్ కారులో రూ. 850, ఎగ్జిక్యూటివ్ క్లాసులో రూ. 1600 వరకు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు ఇదే. అయితే త్వరలోనే మరో వందే భారత్ రైలును విశాఖ నుంచే ప్రారంభించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. దీన్ని విశాఖ నుంచి తిరుపతి లేదా సికింద్రాబాద్ మధ్య నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ కు అనుగుణంగా ఎక్కడకు నడపాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. దీని ద్వారా ఒకే రాష్ట్రంలోని ఒకే ప్రాంతం నుంచి రెండు వందే భారత్ రైళ్లను కేటాయించడం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.