‘వందేమాతరం పాడే వారందరూ భారత్కు వ్యతిరేకులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భరీప బహుజన్ మహాసంఘ్ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్. ఈయన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు అన్న విషయం తెలిసిందే. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో ఎఐఎమ్ఐఎమ్ పార్టీతో కలిసి మహారాష్ట్రలో పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకాష్ ప్రకటించారు కూడా.‘నేను జనగణమన పాడితే దేశానికి వ్యతిరేకిని అని నన్ను అంటున్నారు. మరి వందేమాతరం పాడితే నేను నికార్సైన భారతాయుణ్ణి అవుతానా ? ఇలా గీతాలు ఆలపించడం బట్టి ఒకరికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి మీరెవరని అడుగుతున్నా?’ అని ఫైర్ అయ్యారు ప్రకాశ్ అంబేద్కర్. మహారాష్ట్రలోని అకోలా ఎంపీగా ప్రకాష్ అంబేద్కర్ గతంలో గెలిచారు.