Vangaveeti Mohana Ranga has become a hot topic in AP politics
mictv telugu

ఏపీలో మార్మోగుతున్న రంగా పేరు.. మధ్యలో నలిగిపోతున్న రాధా

December 26, 2022

Vangaveeti Mohana Ranga has become a hot topic in AP politics

మూడున్నర దశాబ్దాల క్రితం హత్యకు గురైన వంగవీటి మోహన రంగా పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ మార్మోగుతోంది. దీక్ష చేస్తున్న ఆయనను అయ్యప్పమాల వేషధారణలో వచ్చిన దుండగులు కిరాతకంగా చంపేశారు. దీని వెనుక ఉన్నది అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ, చంద్రబాబులు కారణమనే ఆరోపణలు బలంగా వినిపించాయి. బలమైన నాయకుడిగా ఉన్న రంగా హత్యతో బెజవాడ అట్టుడిగి పోయింది. అనేక ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కాలక్రమేణా పరిస్థితులు సద్దుమణగగా, రంగా వారసుడు వంగవీటి రాధా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాధా మొదట టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరగా, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాక వైఎస్సార్సీపీలో చేరి కొన్నాళ్లు అందులో కొనసాగారు. అయితే 2019లో ఎన్నికలకు ముందు జగన్ తో విభేదించిన రాధా టీడీపీలో చేరగా, అప్పట్లో రంగా అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు.

అయినా వెనక్కి తగ్గని రాధా ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పని చేసినా ఆ పార్టీ ఓడిపోవడంతో అప్పటినుంచి కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల రంగా జయంతి సందర్భంగా తనపై రెక్కీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరికీ రంగా ఎపిసోడ్ గుర్తుకు వచ్చింది. అదే వేదికపై అప్పుడు మంత్రులుగా ఉన్న కొడాలి నాని ఈ మాటలను సీఎం జగన్ కి నివేదించగా, సెక్యూరిటీ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. కానీ రాధా వద్దన్నారు. ఈ నేపథ్యంలో రంగా వర్ధంతి రాగా, చాలా గ్రామాల్లో రంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీల మధ్య వివాదాలకు కారణమైంది. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉండగా, వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు మంచి మిత్రులు. రెండువైపులా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితిలో రాధా ఉన్నారు. రెండు పార్టీల మధ్య రాధా నలిగిపోతున్నారనే అభిప్రాయం నెలకొంది.

ఇవి కూడా చదవండి : 

ఇకపై చంద్రబాబు కేసీఆర్‌ను ఆడుకుంటారు.. జగ్గారెడ్డి

300 కి.మీ.లు వీల్ చెయిర్ లో శబరిమలకు..