వంగవీటి రాధా పోటీ.. అనకాపల్లా? నరసాపురమా ? - MicTv.in - Telugu News
mictv telugu

వంగవీటి రాధా పోటీ.. అనకాపల్లా? నరసాపురమా ?

March 14, 2019

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయమై గురువారం మధ్యాహ్నం క్లారిటీ వచ్చేసింది. ఆయన లోక్‌సభ బరిలో దిగే యోచనలో వున్నారు. విజయవాడ నుంచి కాకుండా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం ప్రతిపాదన పెట్టడంతో ఆయన రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. రాధా అనకాపల్లి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండగా పార్టీ అధిష్టానం మాత్రం అనకాపల్లితో పాటు నరసాపురం  లోక్‌సభ స్థానం నుంచి రాధా పోటీపై పరిశీలిస్తోంది.

Vangaveeti Radha Contest .. Anakapalli .. Narasapuram

ఇవాళ సాయంత్రానికల్లా ఈ విషయమై క్లారిటీ రానుంది. పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుంది. సొంత జిల్లాను కాదని వెళ్తున్న వంగవీటి రాధాకు విశాఖ కలిసొస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఇదిలావుండగా 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచిన అవంతి శ్రీనివాస్ ఆతర్వాత పార్టీకి రాజీనామా చేశారు. ఆపై వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది.