మూడో పెళ్లిపై విమర్శలు.. ‘దేవి’ హీరోయిన్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

మూడో పెళ్లిపై విమర్శలు.. ‘దేవి’ హీరోయిన్ ఆగ్రహం

June 30, 2020

Vanitha Vijayakumar.

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న ‘దేవీ’ సినిమా నటి వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో సహ నటిపై నిప్పులు చెరిగారు. తానెవరి వ్యక్తిగత జీవితాల గురించి ప్రస్తావించట్లేదని.. ఎవరూ తన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడానికి వీల్లేదని ఘాటుగా రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో నటి, వ్యాఖ్యాత లక్ష్మీ రామకృష్ణన్‌, వనితా విజయ్‌కుమార్ మూడో పెళ్లి గురించి పోస్ట్ పెట్టారు. ‘ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు? బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయినవారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. అయినా పెళ్లి జరిగిపోయే వరకు పీటర్ మొదటి భార్య ఎందుకు ఆగారు? ముందే ఎందుకు ఆపలేదు?’ అంటూ లక్ష్మి ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై వనిత ఘాటుగా స్పందించారు. ‘ఇద్దరు మనషులు ఎందుకు విడిపోతారో, ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? ఈ విషయంతో నీకెలాంటి సంబంధమూ లేదు. నువ్వు ఇందులో వేలు పెట్టడం మంచిది కాదు. నేను వేరెవరి వ్యక్తిగత జీవితాల్లోనూ తలదూర్చడం లేదు. దయచేసి నీ పని నువ్వు చూసుకో’ అంటూ వనిత విరుచుకుపడ్డారు. కాగా, ఇటీవల వనిత పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది వనితకు మూడో వివాహం కాగా, పీటర్‌కు రెండో పెళ్లి. ఈ పెళ్లిపై పీటర్ మొదటి భార్య కోర్టును ఆశ్రయించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.