జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందుకోసం అదిరిపోయే వాహనాన్ని సిద్ధం చేశారు. కొంచెం విభిన్నంగా ఈ వాహనాన్ని తీర్చిద్దిదారు. ఈ మేరకు ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బస్సుతో దిగిన ఫోటోలను పవన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆర్మీ వాహనం మాదిరిగా ఈ వెహికల్‌ను పవన్ తయారు చేయించారు. మూడు నెలలు శ్రమించి ప్రత్యేకంగా డిజైన చేశారు. ఈ సందర్భంగా విడుదలైన వాహనం వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ట్రక్ ఇరువైపులా సైనికుల్లా నడుస్తున్న పవన్ బాడీ గార్డులను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
గత కొంత కాలం కిందటనే పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని అనుకున్నారు.కానీ అది ముందుకుసాగలేదు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వని కారణంగా తన యాత్ర ఆలస్యమవుతుందని పవన్ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర ప్రారంభం అయనప్పటినుంచి ఎన్నికల వరకు పవన్ రాష్ట్ర పర్యటనలోనే ఉండే అవకాశం ఉంది.
సుమారు ఏడాది పాటు రాష్ట్రంలో విరామం లేకుండా పర్యటించబోతున్నారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులను తీసుకొస్తుందో వేచి చూడాలి.
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022
varahai ready for election battel..tweet from pavan kalyan
pavan kalyan ,varahai, election battel, tweet