ఏపీలో పర్యటనకు పవన్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే పవన్ రాష్ట్ర పర్యటన ప్రారంభం కానుంది. ఇందుకు కోసం తయారు చేసినా ‘వారాహి’వాహనాన్నికూడా పరిచయం చేశారు. అన్ని హంగులు ఉండేలా దానిని తయారు చేయించారు పవన్. ఈ వాహనం రిజిస్ట్రేషన్ పనులు ఇటీవల పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో వారాహి కి పూజలు చేయించి రోడ్డు ఎక్కించాలని జనసేనాని భావిస్తున్నారు. ఇందుకోసం ముందు చెప్పిన విధంగానే తెలంగాణలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి వాహనాని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొండగట్టులో వారాహి పూజలు జరగనున్నట్టు జనసేన నేతలు వెల్లడించారు. అనంతరం విజయవాడ వాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నట్లు తెలిపారు. అయితే, తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పవన్ ఏపీలో యాత్ర ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనేది కూడా ఇంకా ఫైనల్ చేయలేదు. తెలంగాణలో కూడా పవన్ వారాహితో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.