దర్శకురాలిగా లేడి విలన్.. ఫస్ట్ లుక్ ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకురాలిగా లేడి విలన్.. ఫస్ట్ లుక్ ఇదే

October 18, 2020

మరో నటి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు డైరెక్టర్లుగా మరీనా సంగతి తెల్సిందే. తాజాగా తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవడానికి సిద్ధం అయ్యారు. తెన్నాండాల్ ఫిలింస్ బ్యానర్‌పై రామస్వామి నిర్మాతగా రోపొందుతోన్న ‘కన్నామూచి’ అనే సినిమాకు వరలక్ష్మి దర్శకత్వం వహిస్తున్నారు. 

దీనికి సంబంధించిన పోస్టర్‌ను వరలక్ష్మి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది ఓ హారర్ సినిమా అని తెలుస్తోంది. మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో నటిగా దూసుకుపోతుంది. హీరోయిన్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో లేడీ విలన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. పందెంకోడి 2, సర్కార్ సినిమాల్లో వరలక్ష్మి నెగటివ్ పాత్రలో నటించింది.