తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఇటీవల నటించిన మూవీ వారసుడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళనాడులో జనవరి 11న ‘వారిసు’ పేరుతో అక్కడ అభిమానులను పలకరించగా..తెలుగులో మాత్రం జనవరి 14న ‘వారసుడు’గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి వాల్తేరు వీరయ్యగా, బాలకృష్ణ వీరసింహారెడ్డిగా రేసులో ఉండడంలో వారుసుడికి పెద్దగా కలిసిరాలేదు. చివరికి యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంది. తెలుగులో రూ 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన వారసుడు..ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోని తొందరగానే వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 22న అమెజాన్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మొదట ఈనెల 10నే విడుదల చేయాలని భావించినా..స్టార్ హీరో, పెద్ద బ్యానర్ సినిమా కావడంతో వాయిదా వేశారు. నెల రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని భావించి ఫిబ్రవరి 22న ముహుర్తం ఫిక్స్ చేశారని సమాచారం.