Variety punishment for liquor addicts in Visakha
mictv telugu

విశాఖలో మందుబాబులకు వెరైటీ శిక్ష.. వీడియో

February 21, 2023

Variety punishment for liquor addicts in Visakha

మద్యపానం చేసి డ్రైవింగ్ చేస్తే జరిమానానో లేక జైలు శిక్షనో వేస్తారని మనకు తెలుసు. కానీ దీనివల్ల అనుకున్నంత మార్పు రావట్లేదని అనుకున్నారో ఏమో. వైజాగ్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన మద్యం బాబులకు వింత శిక్ష విధించారు. మొత్తం 52 మందిని పట్టుకుని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి ఈ శిక్షను విధించారు. ఆర్కే బీచ్‌లోని చెత్తను ఏరివేయడమే శిక్షగా ఖరారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పని చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని తీసుకొని బీచ్‌కు వచ్చి చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. ఇదంతా వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూద్దాం మరి దీని వల్లనైనా వారిలో మార్పు వస్తుందేమో.