భార్యా, భర్త చెరి సగం అంటారు. పెళ్ళైన దగ్గరి నుంచి మిగతా రిలేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే భార్యాభర్తల సబంధం ఒక ఎత్తు. ఒకరికోసంఒకరు బతికే ఆ అనుబంధానికి ఉన్న స్పెషాలిటేనే వేరు. అలాంటి బంధంలో కోపాలు, అలకలు, పోట్లాటలు అన్నీ సహజం. అన్నింటికన్నా భర్తల విషయంలో భార్యలు ఎక్కువగా అలిగేది ఎక్కడో తెలుసా. ఏ విషయానికి భర్త అంటే చాలా కోసం అని ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తారో తెలుసా….డేట్స్ విషయంలో. అదేంటో నూటికి 60 శాతం మంది భర్తలకు లైఫ్ లో ఇంపార్టెంట్ తేదీలు అస్సలు గుర్తుండవు.
అడాళ్ళు, మగాళ్ళు అన్నింటిలోనూ సమానం. హౌస్ వైఫ్ అయినా కూడా భర్తలతో సమానంగా పనులు చేస్తారు భార్యలు. అయినా కూడా మాక్సిమమ్ ఆడవాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకుంటారు కానీ భర్తలు మాత్రం మర్చిపోతుంటారు. ముఖ్యంగా భార్యల పుట్టినరోజలు. ఆఫీస్ లో అన్ని గుర్తు పెట్టుకుని పనులు చేసే మగాళ్ళు ఇంట్లో వాళ్ళు పుట్టినరోజులు ఎలా మర్చిపోతారో ఏంటో. ఇది వింద సమస్యే. దీనికి పరిష్కారం మాత్రం ఇప్పటివరకు దొకలేదు. అసలు కారణమేమిటో తెలిస్తే కదా దొరికేది. అందుకే ఆ దేశం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు.
భార్యల పుట్టినరోజులు మర్చిపోయే భర్తలు జైలుపాలే అక్కడ. నిజమా…అంతలా ఎందుకు చేస్తారులే అనుకుంటున్నారు కదూ. సమోవా దేశంలో మాత్రం నిజంగా చేస్తారు. అక్కడ వైఫ్ బర్త్ డే మర్చిపోతే అస్సలు ఊరుకోరు, శిక్ష ఖాయం. మరీ మొదటితప్పుకే శిక్ష వేయరు కానీ రిపీట్ అయితే మాత్రం వాచిపోతుంది. భార్య పుట్టినరోజు ఒక ఏడాది మర్చిపోతే జస్ట్ హెచ్చరించి వదిలేస్తారు. అదే రెండో సంవత్సరం కూడా మర్చిపోతే మాత్రం జరిమానా లేదా జైలుశిక్ష పక్కా. అది కూడా 5 ఏళ్ళు ఖైదు.
సమోవా దేశంలో ఈ చట్టాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు. దీని కోసం స్పెషల్ టీమ్ కూడా ఉంది. ఎవరైనా భార్య పుట్టినరోజునాడు విష్ చేయలేదని ఫిర్యాదు చేసారో అంతే….వాళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోతారు. శిక్షలు అమలు చేసేస్తారు. అంతేకాదు ఈ చట్టం కోసం మధ్యమధ్యలో అవగాహనా శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికనుకునేరు భార్యలకు. అమ్మా మీ పుట్టినరోజులు మిస్ చేస్తే వెంటనే కంప్లైంట్ చేయండి అని. భలే మంచి దేశం కదండీ. మనకు కూడా అలాంటి చట్టాలు ఉంటే ఎంత బావుండునో ఎంచక్కా….మీరేమంటారు.