Varisu box office collection Day 6: Thalapathy Vijay's film mints Rs 150 crore globally
mictv telugu

యావరేజ్ అనుకున్న సినిమాకు రూ.150 కోట్ల కలెక్షన్స్

January 17, 2023

సంక్రాంతి పండుగ వేళ టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి , బాలకృష్ణ సినిమాలకు పోటీగా… తమిళ హీరో విజయ్‌ నటించిన ద్విభాషా చిత్రం వారసుడు (తమిళంలో ‘వారిసు’) ఇండస్ట్రీకి షాకులిస్తోంది. తెలుగులో ఈ నెల 14 రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కూడా అలాంటి టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు.

ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు సక్సెస్ అయ్యాడని అంటున్నారు కొంతమంది. మాస్ హీరోతో ఫ్యామిలీ సినిమా చేస్తే చూడడానికి కొత్తగా ఉంటుంది పైగా ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారనే ఆయన ప్లాన్ వర్కవుట్ అయిందంటున్నారు. ఆ విషయాన్నే ప్రూవ్ చేస్తూ వారిసు మూవీపై వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు జనాలు. కోలీవుడ్ లో, ఓవర్సీస్ లో వారిసు మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి 180 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. విజయ్ కి అజిత్ తో క్లాష్ పడిన సమయంలో సూపర్ హిట్ ఇచ్చాడు కాబట్టి ద్దిల్ రాజు ఇకపై తమిళనాడులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు లేట్ గా రిలీజ్ అయిన వారిసు డబ్బింగ్ వర్షన్ వారసుడు సినిమా కూడా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. తొలి రెండ్రోజుల్లో నైజాంలో రూ. 2.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 76 లక్షలు, ఈస్ట్‌లో రూ. 37 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.04 కోట్లు షేర్, రూ. 11.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ఇక ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకు దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌, వి.పొట్లూరి, పెరల్‌ నిర్మించారు. కలెక్షన్లపరంగా తెలుగు, తమిళం.. రెండు చోట్లా దూసుకుపోతోందీ సినిమా. రిలీజై వారం రోజులు కూడా కాకముందే 150 కోట్ల క్లబ్‌లో చేరింది. అటు కేరళలో, ఇటు నార్త్‌లో హిందీలోనూ రిలీజవడంతో అక్కడ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.