వీహెచ్.. బస్తీ మే సవాల్! - MicTv.in - Telugu News
mictv telugu

వీహెచ్.. బస్తీ మే సవాల్!

August 24, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాపై రాం గోపాల్ వర్మ, వి. హనుమంతులరావుల మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడి, తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వర్మపై వీహెచ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘వర్మను హైదరాబాద్ లోకి అడుగుపెట్టనియ్యం’’ అని హెచ్చరించారు. దీనిపై వర్మ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.. ‘ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాు.. నన్ను హైదరాబాద్ లోకి అడ్డుగుపెట్టకుండా చెయ్యడం కన్నా.. మీ మనవళ్లు, మనవరాళ్ల వయసులో ఉన్న వారిని ఆ సినిమా థియేటర్లకు వెళ్లకుండా చూడు దమ్ముంటే.. ’’ అని వర్మ టీట్ చేశారు. అంతటితో ఆగకుండా.. ‘నేను రేప్పొద్దున ప్రసాద్ ఐమ్యాక్స్లో 10.30 షోకి వస్తున్నా.. అక్కడ కలుద్దాం.. బస్తీమే సవాల్’ అని రెచ్చగొడుతూ ఫేస్ బుక్లో మరో పోస్ట్  చేశారు. అర్జున్ రెడ్డి సినిమా ప్రచారం కోసం వీహెచ్ ఆ సినిమా నిర్మాత నుంచి డబ్బులు తీసుకున్నట్లు తనకు అనుమానంగా ఉందని కూడా రెచ్చగొట్టారు.

‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ ను వీహెచ్ చించిపారేయడంతో వర్మ ఆయనను టార్గెట్ చేసుకోవడం తెలిసిందే. దీనిపై వర్మ రోజూ వరస ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులు వదుల్తూ వీహెచ్ ను ఆటపట్టిస్తున్నారు.