పవన్ కళ్యాణ్  కంటే విజయ్ పదిరెట్లు బెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్  కంటే విజయ్ పదిరెట్లు బెటర్

August 28, 2017

విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంటున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై  రాంగోపాల్ వర్మ మళ్లీ ఫేస్ బుక్ లో కామెంట్ చేశాడు. చూస్తుంటే ఈ సినిమా వందరోజులు అయ్యేవరకు.. ఆయన ఫేస్ బుక్ వాల్ పై ‘అర్జున్ రెడ్డి’ టాపిక్కే ఉండెటట్టుంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఏడు,ఏనిమిది సీన్లు అచ్చం ఆయన లైఫ్ లో కూడా జరిగాయట. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించిన  విజయ్ దేవరకొండ తెలంగాణ మెగాస్టార్  అని… ఒక్క మాటలో చెప్పాలంటే  విజయ్ లుక్స్ మరియు కరిజ్మా.. పవన్ కళ్యాణ్ కంటే పదిరెట్లు బెటరని, యాక్టింగ్ లో అయితే  ఇరవై రెట్లు బెటరని వర్మ అన్నాడు.

అంతేకాదు విజయ్ దేవరకొండకు  రియల్ పవర్ స్టార్ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని వర్మ  అన్నాడు. మొత్తానికైతే  పబ్లిక్ కంటే  పదిరెట్లు.. కాదు వందరెట్లు కాదు అంతకు మించే ఈ సినిమా వర్మకి నచ్చినట్టుంది.