కన్నడిగులపై వర్మ కన్నెర్ర..ఎందుకంటే... - MicTv.in - Telugu News
mictv telugu

కన్నడిగులపై వర్మ కన్నెర్ర..ఎందుకంటే…

May 19, 2017

ట్విట్టర్ డైరెక్టర్ వర్మ నజర్ కర్ణాటకపై వైపు మళ్లింది. కన్నడిగులపై ట్విట్ల వర్షం కురించాడు. బాహుబలి 2 సక్సెస్ ను ప్రస్తావిస్తూ కన్నడ సినిమాలపై విరుచుకుపడ్డారు.‘‘తెలుగులో వచ్చిన బాహుబలి-2 కర్ణాటకలో అక్కడి సినిమాల కంటే భారీ విజయం సాధించింది. కన్నడిగులు చేసే డబ్బింగ్‌ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసింది. దీన్నిబట్టి కన్నడిగులకు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోంది. కన్నడిగులు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలి’’ అంటూ వర్మ వ్యాఖ్యానించారు.
‘కట్టప్ప’ పాత్రధారి సత్యరాజ్‌ తొమ్మిదేళ్ల క్రితం కర్ణాటకపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. సత్యరాజ్‌ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో బాహుబలి-2ను విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. దీంతో సత్యరాజ్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. శాంతించిన కన్నడ సంఘాలు బాహుబలి-2 విడుదలకు అంగీకరించాయి.. వివాదం ముగిసిందనుకుంటున్న వర్మ ఇలా కామెంట్లు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.