చంద్రబాబుకు వర్మ దిమ్మదిరిగే కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబుకు వర్మ దిమ్మదిరిగే కౌంటర్

October 18, 2017

రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ విషయంలో రాజకీయ నాయకలు తలదూర్చడం ఎక్కువైంది. ముఖ్యంగా టీడీపీ నేతలు రోజూ వర్మను తిడుతున్నారు. ఆయన కూడా ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. చివరికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. వర్మ సినిమాను పట్టించుకోవద్దని తమ్ముళ్లకు చెబుతూ, నిజాలను వక్రీకరించవద్దని వర్మను హెచ్చరించారు. దీనిపై వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చాడు ఫేస్ బుక్ పోస్టులో.. అదేమిటో వర్మ పోస్టులో నేచూడండి..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై సీఎం చంద్రబాబు నాయుడు గారి కామెంట్ల పై నా కామెంట్లు :

లక్ష్మి’స్ ఎన్టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుగారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను.

CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్‌ నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో తీస్తున్నాడు వర్మ. దీంతో అప్పటి రాజకీయాలు, ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు తదితర అంశాలను చూపాల్సి ఉంటుంది. వాస్తవాలను వాస్తవాలుగా చూపితే చంద్రబాబు చాలా ఇబ్బంది పడతారు. అందుకే టీడీపీ నేతలు వర్మపై గుస్సా అవుతున్నారు. అయినా వర్మ తగ్గడం లేదు. నిజాలనే చూపుతానని, చిరిగిపోయిన పేజీలను అతికిస్తానని వర్మ చెప్పడం చంద్రబాబుకు మింగుడు పడని విషయమే.