Varun Dhawan gives health update about Vestibular Hypofunction diagnosis
mictv telugu

మరో స్టార్ హీరోకు అరుదైన వ్యాధి

November 9, 2022

Varun Dhawan gives health update about Vestibular Hypofunction diagnosis

ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ..డైట్ ప్రకారం మంచి ఆహారాన్ని తీసుకునే సెలబ్రెటీలు సైతం రోగాల భారీన పడడం కలవరపెడతోంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇప్పటికే సమంత ప్రకటించి అభిమానులను షాక్‌కు గురి చేయగా.. . తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు. ‘వెస్టిబ్యులార్‌ హైపోఫంక్షన్‌’ అనే అరుదైన వ్యాధితో తాను సతమతమవుతున్నానని ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నట్టు ప్రకటించాడు.

వెస్టిబ్యులార్‌ హైపోఫంక్షన్‌ వ్యాధితో బాధపడుతున్న వరుణ్ ధావన్‌.. గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా యోగా, స్విమ్మింగ్‌తోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేస్తున్నారు. పలువురు నిపుణుల పర్యవేక్షణలో వివిధ ఫిజికల్‌ యాక్టివిటీస్‌ చేస్తూ కోలుకుంటున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.ఈ సమయంలో ఆర్యోగానికి సంబంధించి పలు సూచనలు కూడా రిషిధావన్ చేసారు. ‘మనం నిత్యం బిజీగా ఉంటూ అన్నీ తింటున్నాం. ఎంజాయ్‌ చేస్తున్నాం. సూర్యరశ్మిని మాత్రం మర్చిపోతున్నాం. ఈ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందుకని ప్రతీ రోజు సూర్య కిరణాలు కొన్ని నిమిషాల పాటు మన శరీరంపై పడేలా చూసుకోవడం చాలా ముఖ్యం..’ అన్న విషయాన్ని రిషి ధావన్ షేర్ చేసాడు.

వెస్టిబ్యులార్‌ హైపోఫంక్షన్‌ వ్యాధికి గురైన వారిలో వికారం, వాంతులు, కూర్చోలేకపోవడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నీరసంగా ఉండి నడవడం కూడా కష్టమవుతుంది. జ్ఞాపకశక్తి సైతం తగ్గిపోతుంది. ఈ వ్యాధి మన జీవితాన్ని, మన పనితీరును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. తలకు గాయమైనప్పుడు, మెదడులో రక్తం గడ్డకట్టడం, వయుస్సు పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.