బిగ్ బాస్‌లో ‘గద్దలకొండ గణేష్’ సందడి - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్‌లో ‘గద్దలకొండ గణేష్’ సందడి

September 22, 2019

వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఈవారం బిగ్ బాస్ హౌజ్‌కు అతిథిగా వచ్చాడు. హౌజ్‌లో కాసేపు సరదాగా గడిపాడు. 

#BiggBossTelugu3 #WeekendSpecial

Sunday Funday ki special guest ga #GaddalakondaGanesh Varun Tej with King Akkineni Nagarjuna #BiggBossTelugu3 Today at 9 PM on Star Maa

Posted by Star Maa on Saturday, 21 September 2019

‘గద్దలకొండ గణేష్‌’గా వచ్చాడు కాబట్టి తెలంగాణ యాసలోనే మాట్లాడాడు. వరుణ్ వచ్చాక నాగార్జున కూడా మాస్ హీరోగా మారి విజిల్స్ వేస్తూ సందడి చేశారు. ఇక ఇంట్లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా గద్దలకొండ గణేష్ రాకతో మాస్ అయిపోయారు. సూపర్ హిట్టు నీ హైట్ అంటూ రచ్చ రచ్చ చేసారు. మరోవైపు శ్రీముఖి, హిమజ మన గద్దలకొండ గణేష్‌కు ప్రపోజ్ చేయడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజు రాత్రి ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది..