వరుణ్ తేజ్ వార్నింగ్.. అన్నను ఒక్క మాటంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

వరుణ్ తేజ్ వార్నింగ్.. అన్నను ఒక్క మాటంటే..

March 28, 2022

vb

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకను మార్చి 27న (ఆదివారం) శిల్ప కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు జై చరణ్, జై అల్లూరి సీతారామరాజు అంటూ నినాదాలు చేస్తూ, సందడి చేశారు. అనంతరం వరణ్ తేజ్ మాట్లాడుతూ..”రాం చరణ్‌ అన్న మీకూ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టిన రోజుకి నేను మీకూ ఏదో బహుమతి ఇస్తాను. కానీ ఈసారి మీరు నాకు బహుమతి ఇచ్చారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేసి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి చరణ్ అన్న అంటే నాకు భయం. ఎప్పుడైనా ఏడిపిస్తే చిరంజీవి గారి వెనక దాచుకునే వాడిని. అది చిన్నప్పుడు. ‘చిరుత’ సినిమా చేశాక అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ పలు రకాల క్యారెక్టర్లు చేస్తూ, చాలా ఎదిగిపోయావు. చరణ్ అన్నకి నేను తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం.

చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ, కళ్యాణ్ బాబులో ముక్కుసూటితనం ఈ రెండు కలబోసుకున్న వ్యక్తి మా అన్న రాంచరణ్” అంటూ మెగా అభిమానులను హూషారెత్తించారు. ఆర్ఆర్ఆర్ స్క్రీన్‌పై చరణ్‌ని చూస్తున్నట్టు అనిపించలేదు. సాక్షాత్తు అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్టే అనిపించిందని అన్నారు. ఇక చివరగా.. ”చరణ్ అన్నను ఎవరన్నా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే, మీరందరితో పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చు” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వరణ్ తేజ్ ఇచ్చిన ఈ వార్నింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరణ్ తేజ్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఎందుకిచ్చారు? అది ఎవరికి? అనే అంశంపై టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ మొదలైంది.