ఇప్పుడు ప్రతిదానికీ వాస్తు పరిశీలిస్తున్నారు. భూమికి సంబంధించిన ప్రతిదీ వాస్తు ప్రకారమే జరుగుతుంది. ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ నుంచి భవన నిర్మాణం వరకు వాస్తును చూస్తున్నారు. వాస్తు ప్రకారం గృహోపకరణాలు ఉండకపోతే ఆర్థికం నష్టపోతారని..ఇంట్లో సమస్యలు వస్తాయని చెబుతుంటారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఇంటి దిశ గురించి చెబుతుంది. ముఖ్యంగా ఇంటికి ఈశాన్యదిశ చాలా ముఖ్యమైంది. ఈ దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో చేసిన తప్పులు చేసినట్లయితే ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం.
వాస్తుప్రకారం..ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వేడిని ఉత్పత్తి చేసే పరికరాలను ఈశాన్యదిశలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కొడుకు తండ్రిమాటను ధిక్కరించి అవమానిస్తాడు. బెడ్ రూమ్ లో మంచానికి దగ్గరగా అద్దం ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవే కాకుండా ఫ్లాట్లు ఉత్తరం, దక్షిణాలలో ఇరుకుగా..తూర్పు, పడమర పొడవుగా ఉంటే ఆ స్థలాన్ని సూర్యభేది అంటారు. మీ ప్లాటు లేదా ఇంటి డిజైన్ ఈ విధంగా ఉంటే తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఈశాన్య దిశలో ఇవి ఉంచకూడదు
పొరపాటున కూడా పాదరక్షలు ఇంటికి ఈశాన్య దిశలో ఉంచకూడదు. మురికి వస్తువులు లేదా చెత్తబుట్టను కూడా ఈ దిశలో పెట్టుకూడదు. ఎందుకంటే ధూళికారణంగా ఈ దిశ కలుషితం అవుతుంది. దీంతో మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.