నా వెంట నలుగురు ఎమ్మెలు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే  - MicTv.in - Telugu News
mictv telugu

నా వెంట నలుగురు ఎమ్మెలు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే 

September 23, 2020

Vasupalli Ganesh On Chandrababu

టీడీపీకి రెబల్ ఎమ్మెల్యేల రూపంలో ఊహించని షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి నేతలు నేరుగా చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ లిస్టులో వాసుపల్లి గణేష్ కూడా చేరారు. ఇటీవలే సీఎం జగన్‌ను కలిసి ఆయన కుమారులను వైసీపీలో చేర్పించారు. ఆ తర్వాత టీడీపీకి రెబల్‌గా మారిపై ఆయన కూడా మాట తూటాలు పేల్చుతున్నారు. 16 నెలలుగా మనసు చంపుకొని పార్టీలో ఉండలేక బయటకు వచ్చానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. తన వెంట నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేసి తాడే పేడో తేల్చుకుంటామన్నారు.ప్రతిపక్ష పార్టీగా టీడీపీ విఫలమైందని విమర్శించారు.సూటు బూటు వేసుకున్న వారికే టీడీపీ ప్రభుత్వంలో పనులు జరిగాయని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ ఉండదని అన్నారు. కొంత మంది ప్రయోజనాల కోసమే విశాఖలో పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. తాను అమరావతికి ఏనాడు మద్దతు తెలపలేదని స్పష్టం చేశారు.  వైసీపీ కోసం తనకు ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానని తెలిపారు.