వరవరరావు ఆరోగ్యం విషమం..భార్యకు జైలు నుంచి ఫోన్  - MicTv.in - Telugu News
mictv telugu

వరవరరావు ఆరోగ్యం విషమం..భార్యకు జైలు నుంచి ఫోన్ 

July 2, 2020

Vavararao heath condition deteorated mumbai jail officials 

ప్రముఖ కవి, విప్లవరచయితల సంఘం నాయకుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. 80 ఏళ్లు పైబడిన ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కాస్త కోలుకున్నారు. అంతలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించిందని ముంబైలలోని తలోజా జైలు సిబ్బంది హైదరాబాద్‌లోని ఆయన భార్య హేమలతకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు, తెలంగాణ ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మానవతా దృక్పథంతో వెంటనే విడుదల చేసి మెరుగైన వైద్యసదుపాయం కల్పించాలని కోరుతున్నాయి. తలోజా జైల్లో ఓ ఖైదీ కరోనాతో చనిపోయారని, వరవరరావు ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకవాశముందని అంటున్నారు.  

ఆయనకు ప్రస్తుతం జైల్లోని ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు జైలు సిబ్బంది చెప్పారు. భీమా కొరేగావ్ కేసులో అరెస్టయిన వరవరరావుకు కోర్టులు బెయిళ్లు ఇవ్వడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులతో కలసి కుట్రపన్నారంటూ మహారాష్ట్ర పోలీసు ఆయనను 2018 నవంబర్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను చేయాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాలకు లేఖలు రాసినా స్పందన లేకుండా పోతోంది. వరంగల్ జిల్లాకు చెందిన వరవరరావు యాభై ఏళ్లుగా తెలుగు ప్రజలకు సుపరిచితుడు.