టెక్ ప్రపంచంలో భారతీయుల నైపుణ్యం అందరికీ తెలిసిందే. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీల్లో మనవాళ్లే కీలక స్థాయిలో ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకైతే ఏకంగా సీఈఓ స్థానంలో ఉన్నారు. అనేక కోడింగ్ పోటీల్లో, బగ్ ఫైండింగ్ కాంపిటీషన్లలో కూడా భారతీయులు సత్తా చాటుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే మహారాష్ట్రకు చెందిన వేదాంత్ దేవ్ కాటే. అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన కోడింగ్ పోటీల్లో పాల్గొని రెండ్రోజుల్లోనే 2066 లైన్ల కోడ్‌ను వేదాంత్ రాశాడు. వెయ్యి మంది పాల్గొన్న ఈ పోటీలో వేదాంతే గెలిచాడు.
దీంతో మనోడి టాలెంట్ చూసిన కంపెనీ రూ. 33 లక్షల వార్షిక ప్యాకేజీతో కోడింగ్ నిపుణుల మేనేజరుగా ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ క్రమంలో వేదాంత్ వయసు తెలుసుకున్న కంపెనీ తర్వాత వెనక్కి తగ్గింది. వేదాంత్ వయసు కేవలం 15 ఏళ్లే అని తెలుసుకొని షాకయింది. ఇంత చిన్న వయసు వారికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో చదువు పూర్తయిన తర్వాత వేదాంత్‌ను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు వేదాంత్‌కు లేఖ రాసింది. కాగా, వేదాంత్ తల్లిదండ్రులు నాగపూర్‌లోని ఇంజనీర్ కాలేజీలో ప్రొఫెసర్లు. వేదాంత్ చిన్నప్పటి నుంచి తల్లి ల్యాప్‌టాప్‌తో కుస్తీలు పట్టి కోడింగ్ నేర్చుకున్నాడు. అంతేకాదు, పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో సొంతంగా రాడార్ తయారు చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇన్ని తెలివితేటలు ఉన్నా వయసు కారణంగా కంపెనీలోకి తీసుకోవడం కుదరట్లేదని కంపెనీ విచారం వ్యక్తం చేసింది.
Vedant won a coding competition organized by an American company
Vedant, coding competition, American company, won, maharashtra