Vedhaa movie teaser launching by creative genius sukumar
mictv telugu

సుకుమార్ చేతుల మీదుగా ‘వేద’ టీజర్ విడుదల

September 22, 2022

 

చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డీ. స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘వేద’ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురువారం విడుదల చేశారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సుకుమార్‌ మాట్లాడుతూ… ‘టీజర్‌ బ్లాస్టింగ్‌. ‘వేద’ టైటిల్‌ కూడా నైస్‌. నిర్మాతలు అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి యూనిట్‌ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడు అజయ్‌ మంచి వర్క్‌ చేశారు. చంద్రబోస్‌ గారి సాహిత్యం గురించి ఇక చెప్పేదేముంది, రాకింగ్‌. హీరో చేనాగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా బాగుంది. టీం అందరికీ అల్ ద బెస్ట్’ అని చెప్పారు.

దర్శకుడు జె.డి. స్వామి మాట్లాడుతూ.. ‘కొత్త జానర్‌తో రావాలని సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసుకొని ముందుకు రావడానికి ముగ్గురు కారణం. ఈ నిర్మాతలు, దర్శకులు సుకుమార్, చంద్రబోస్. మన లైఫ్‌లో తల్లి, తండ్రి, గురువులకు కీలక పాత్ర ఉంటుంది. తడబాటు అడుగులకు తండ్రిగా ధైర్యాన్ని ఇచ్చి నడక నేర్పారు సుకుమార్ గారు. అలాగే ప్రేమంటే ఏంటి? అది ఎలా ఉంటుంది అంటూ చంద్రబోస్ గారు కొత్త కాన్సెప్ట్‌తో పాట రూపంలో చాలా విషయాలు నేర్పించారు’ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ బేనర్‌పై జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు.