వీడు మగాడ్రా బుజ్జి.. ఏకంగా 550 రోజులు.. - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మగాడ్రా బుజ్జి.. ఏకంగా 550 రోజులు..

April 23, 2022

మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి వారం కాదు. రెండు వారాలు కాదు. ఏకంగా 550 రోజులు, 9 ఆస్పత్రులలో చికిత్స తీసుకుని, కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు ఎస్కార్ట్‌‌తో, దారి పొడవునా జనం నిలబడి వీడు మగాడ్రా బుజ్జి అంటూ ఆ వ్యక్తికి స్వాగతం పలికారు. రాత్రికి రాత్రే ఆ వ్యక్తి సెలబ్రిటిగా మారిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. న్యూ మెక్సికోలోని రోస్‌వెల్‌కి చెందిన డోన్నెల్ హంటర్‌కు సెప్టెంబరు 2020లో కరోనా బారినపడ్డాడు. ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. చికిత్స కోసం ఓ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో మరొక ఆస్పత్రిలో చేరాడు. ఇలా మొత్తం తొమ్మిది ఆసుపత్రులలో చేరాల్సి వచ్చింది. డోన్నెల్ కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా ఆశను వదులుకున్నారు. అతడు ఇక ఎప్పటికీ ఇంటికి రాడని ఫిక్స్ అయ్యారు. ఆసుపత్రిలో ఏడాది పాటు హంటర్ వెంటిలేటర్‌పైనే ఉన్నాడు.

‘‘నా కాళ్లు చేతులు అన్నీ అచేతనంగా మారిపోయాయి. వాటిని కనీసం కదలించలేకపోయాను. నేను బతుకుతానని ఆశను కుటుంబ సభ్యులు దాదాపు కోల్పోయారు. అందుకే నా రాక కోసం అందరూ వేయికళ్లతో ఎదురు చూశారు. అన్నీ మరిచిపోయాను. స్పీచ్ థెరపీ చేశారు. తినడం, మింగడం సహా నేను ప్రతిదీ మళ్లీ నేర్చుకోవాల్సి వచ్చింది’’ అని హంటర్ అన్నారు.

ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్లిపోయినట్టు తరుచూ కలల కనేవాడ్నినని, మేల్కొన్న తర్వాత అది నిజం కాదని తేలిసేదని హంటర్ చెప్పారు. కానీ, ఈసారి అది నిజమయ్యిందన్నారు. ‘నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడికి కృత‌జ్ఞ‌త‌లు2 అని హంటర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏడాదిన్నర పాటు ఆస్పత్రిలో ఉండి కుటుంబంతో మళ్లీ కలవడం తనకు పునర్జన్మలా ఉందని చెప్పాడు.