Veena and Vani are two identical twins who passed in Inter First Class
mictv telugu

ఇంటర్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసైన అవిభక్త కవలలు వీణ – వాణి

June 28, 2022

రెండు తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు వీణ, వాణిలు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రిలీజ్ చేసిన ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. వీణకు 712 మార్కులు, వాణికి 707 మార్కులు వచ్చాయి. దీంతో పలువురు వారికి అభినందనలు తెలుపుతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే వారికి సహకరించిన అధికారులకు ఆమె దన్యవాదాలు తెలిపారు.