వీణ శ్రీవాణి ప్రపంచ రికార్డు..! - MicTv.in - Telugu News
mictv telugu

వీణ శ్రీవాణి ప్రపంచ రికార్డు..!

September 8, 2017

ఆమె వీణ పట్టిందంటే చాలు ఎటువంటి రాగాలైనా,ఎటువంటి పాటలైనా వీణపై నాట్యం ఆడాల్సిందే. ఆమే మాదాపూర్ కు చెందిన సంగీత విద్వాంసురాలు వీణా శ్రీవాణి. శాస్త్రీయ పాటలైన ,మాస్ పాటలైనా ఎలాంటి పాటలైనా ఆమె వీణలో పలకాల్సిందే. మాయదారి మైసమ్మ అయినా  మహాగణపతేం అయినా సినిమా పాటలైనా అన్ని చకా చకా వాయిస్తుంది. అయితే ఇపుడు ప్రపంచంలోనే అతి చిన్న వీణపై ఏకధాటిగా 15 నిమిషాల పాటు స్వరాలు పలికించి ప్రపంచ రికార్టు సృష్టించింది.  ‘ అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్-2017’లో చోటు దక్కించుకుంది. సాధారణంగా వీణ సుమారు 54 నుంచి 62 ఇంచుల పొడవు, 10 ఇంచుల వెడల్పు ఉంటుంది. అయితే విజయవాడకు చెందిన మబ్బూ షేక్ అనే వ్యక్తి ఇటివల 41 రోజుల పాటు శ్రమించి 21 ఇంచుల పొడవు , 6 ఇంచుల వెడల్పు వీణను తయారు చేశారు. ఇప్పటి వరకు ఇంత చిన్న వీణపై ఎవరు స్వరాలు పలికించలేదు.