veera simha reddy box office collection day 1
mictv telugu

తారుమారైన వీరసింహారెడ్డి లెక్కలు.. !

January 13, 2023

veera simha reddy box office collection day 1

2023 సంవత్సరంలో వీరసింహారెడ్డికి వసూళ్ల సునామి పక్క అనుకున్నారు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ మరో నరసింహ నాయుడు అంటూ ప్రచారం చేశారు. ఇక వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ అయితే వస్తున్న హైప్ చూసి.. మొదటి రోజే 50కోట్లు కొట్టి ప్రభంజనం సృష్టిస్తామంటూ బహిరంగంగా ప్రకటించారు. అయితే అందరు అనుకున్నట్టే వీరసింహారెడ్డి బెనిఫిట్ షోస్ కి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. అమెరికాలో అయితే బాలయ్య ఫ్యాన్స్ దెబ్బకు పోలీసులు వచ్చి థియేటర్లు మూసేసిన పరిస్థితి. మార్నింగ్ షో వరకు ఇదే జోష్ కనిపించింది. అయితే ఆ తరువాత నెమ్మదిగా టాక్ డ్రాప్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రముఖ తెలుగు వెబ్ సైట్స్ నెగిటీవ్ రివ్యూస్ ప్రకటించాయో అప్పుడు అసలు విషయం బయటికొచ్చింది.

ఫాన్స్ షోస్ అయిపోయాక.. కామన్ పీపుల్ పబ్లిక్ టాక్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నకొద్దీ వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కష్టమే అనే నిజం తెలిసిపోయింది. కలెక్షన్స్ కూడా అంచనాలని అందుకోలేకపోయాయి. 50కోట్లు ఖాయం అనుకుంటే 30కోట్ల దగ్గరే లెక్క ఆగిపోయింది. వీరసింహారెడ్డి తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.32 కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘అఖండ’ ఫస్ట్ డే కలెక్షన్స్ 22కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా.. సంక్రాంతి బరిలో ఉన్న తమిళ సినిమాలు వారిసు-రూ.27 కోట్లు, తునివు-రూ.26 కోట్ల రికార్డులని బాలయ్య బీట్ చేసి పడేశాడు. ఇలా తన రికార్డ్, తమిళ హీరోల రికార్డ్స్ ని సింగిల్ హ్యాండ్ తో బ్రేక్ చేసిన బాలయ్య వీరసింహారెడ్డికి ఈ రోజు నుండే అసలు పరీక్ష. ఇప్పటికే వాల్తేరు వీరయ్యకి కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ అని మౌత్ టాక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో వీరయ్య ప్రభంజనాన్ని వీరసింహారెడ్డి ఎలా ఎదుర్కొంటాడా చూడాలి.