Home > Featured > సీమలో మోత మోగుతుంటే.. సిటీలో డిజాస్టర్ అంటున్నారేంటీ..!

సీమలో మోత మోగుతుంటే.. సిటీలో డిజాస్టర్ అంటున్నారేంటీ..!

veera simha reddy movie review

బాలకృష్ణ వీరసింహారెడ్డి సంక్రాంతి యుద్దాన్ని మొదలుపెట్టేసింది. అయితే అత్యంత భారీ అంచనాలతో నేడే విడుదలైన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలు బాలయ్యకి కొట్టిన పిండి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడులు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్స్. మళ్ళీ అలాంటి వింటేజ్ ఫ్యాక్షన్ బాలయ్య లుక్స్ తో వీరసింహారెడ్డి తెరకెక్కగా.. నందమూరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభిమాని బాలయ్యను ఎలా చూడాలనుకుంటాడో అలా చూపిస్తా అని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నట్టుగానే ‘వీరసింహారెడ్డి' పాత్రలో బాలయ్యని పవర్ ఫుల్ గా చూపెట్టాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

'వీరసింహారెడ్డిగా బాలయ్య గెటప్ సూపర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. హీరో ఎలివేషన్లు మామూలుగా లేవు. యాక్షన్ ఘట్టాలు వారెవా అనిపిస్తాయి. డైలాగులు పేలిపోయాయి అంటూ సీమ సర్కిల్స్ లో ఫ్యాన్స్ వీరసింహారెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే మరోవైపు మాత్రం టాక్ ఇంకోలా వినపడుతుంది. ఒక సినిమాకు ఎలివేషన్లు.. యాక్షన్ సీన్లు.. డైలాగులు మాత్రమే సరిపోతాయా? ఎంతో కొంత విషయం ఉన్న కథ.. కొంచెం వైవిధ్యం ఉన్న కథనం.. కొన్ని కొత్త సీన్లు ఉండాలి కదా? కానీ గోపీచంద్ ఇవేమీ పట్టించుకోలేదు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన మూస సీమ ఫ్యాక్షన్ మాదిరి ఇది ఒక సాధారణ కథనే అంటూ పెదవి విరుస్తున్నారు. ఎక్కువగా అర్బన్, మల్టిప్లెక్స్ క్రౌడ్ లో ఈ నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సంతృప్తిగా ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక ఒక వర్గం నుండి వీరసింహారెడ్డికి పర్వాలేదు అని టాక్ వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి సీజన్ కాబట్టి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ అంచనాలు వేస్తుంది.

Updated : 12 Jan 2023 2:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top