దేశం కాని దేశంలో.. మన భారతదేశం పరువు నిలపడేలా ప్రవర్తించాలి కానీ ఇలాంటి సందర్భాలు మళ్ళీ కాకుండా చూసుకుంటే బెటర్ అంటూ తాజాగా జరిగిన వీరసింహారెడ్డి థియేటర్ ఘటనపై కామెంట్స్ వస్తున్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి రిలీజ్ కాగా నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మూడు రోజులు ముందే సంక్రాంతి వచ్చిందా అన్న రేంజిలో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతారవరణం నెలకొనగా.. అమెరికాలో సైతం ఇదే పరిస్థితి. అమెరికన్ సిటిజన్స్ తరువాత.. ఎక్కువ శాతం తెలుగు వాళ్లు ఉండే USలో తాజాగా వీరసింహారెడ్డి రిలీజ్ అయిన ఒక థియేటర్ లో రచ్చ జరిగినట్టు తెలుస్తుంది. కులం పేరుతో కొందరు దూషించుకుంటూ థియేటర్స్ లో గొడవ పడ్డారని.. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి షోని ఆపేయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అనుకోని ఈ సంఘటన USAలోని సినిమా హాల్లో జరగటంతో వీరసింహా రెడ్డి ప్రదర్శన అకస్మాత్తుగా ఆగిపోయిందని అంటున్నారు. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
#NandamuriBalakrishna's #VeeraSimhaReddy show stoped in middle and audiences were told to leave theatre in Dallas, USA#NBK fans Raccha in states started this. This is just outrageous 🔥💥 pic.twitter.com/cOjCTSZAPS
— లిక్కర్ హారతి (@AnjiNallamothu) January 12, 2023
కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటూ అరెస్ట్ ల వరకు వెళ్ళటం దారుణమంటున్నారు. వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శన సందర్భంగా అమెరికాలో థియేటర్ లో సినిమా ఆపేసి, జనాలను బయటకు పంపటం.. ఇండియా పరువు తీసినట్టే అంటున్నారు. థియేటర్లో జై బాలయ్య అంటూ నానా గోల చేయడం, ఇష్టం వచ్చినట్లు కాగితాలు చింపి ఎగరవేయటంపై కూడా థియేటర్ యాజమాన్యం అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులకు థియేటర్ ఇంకా పోలీస్ అధికారులు ఫుల్ గా క్లాస్ పీకుతున్న వీడియో అది. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు ప్రదర్శించినా.. ఇలా మన భారతీయుల పరువు పోయేలాంటి పరిస్థితి లేదని, ఇది తొలిసారని క్లారిటీగా క్లాస్ పీకారు. అమెరికాలో సెటిల్ అయినా తెలుగు యువకుల కారణంగా అక్కడ మన టాలీవుడ్ సినిమాల కలెక్షన్లు పెరిగాయి అని సంతోషించాలో,లేదా కులం పేరుతో ఫ్యాన్స్ కుమ్ములాటలు జరిగినందుకు బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.